- టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
ప్రజాశక్తి- పలాస: వైసిపి పాలనలో రాష్ట్రం నాశనమైందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను అతలాకుతలం చేశారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌత శిరీష ఆరోపించారు. మండలంలోని బొడ్డపాడులో ఆదివారం భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల్లో పర్యటించి వైసిపి ప్రభుత్వం అరాచకాలను ప్రజలకు వివరించారు. మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్‌కుమార్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కిక్కెర ఢిల్లీరావు, మురిపిండి కుమార్‌రాజు, ఖగేష, శ్రీహర్షనాయుడు, సప్ప నవీన్ పాల్గొన్నారు.
క్రీడాకారునికి ఆర్థికసాయం
టిడిపి కార్యాలయంలో వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడుకు చెందిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు రాపాక రమేష్ యాదవ్‌కు గ్రామస్తులు చందా రూపంలో వసూలు చేసిన రూ.10 వేలును శిరీష అందజేశారు. అనంతరం క్రీడాకారునికి దుశ్శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి వంసతస్వామి, సూరడ మోహనరావు, అఖిల్, విఠల్‌రావు, నవీన్ పాల్గొన్నారు.










