ప్రజాశక్తి- దేవరాపల్లి
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్, నాయకులు పైలా ప్రసాదరావు అన్నారు. మండలంలోని వాలాబు గిరిజన గ్రామంలో స్థానిక సర్పంచ్ పోడెల వెంకటలక్ష్మి బుజ్జి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర సరుకులు భారీగా పెంచి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా వారిని మోసం చేస్తుందని ఆరోపించారు. వాలాబు గిరిజన గ్రామంలో ఈ మూడున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోతల పాత్రునాయుడు, చల్లా నానాజీ, బండారు రామారావు, కర్రి నాయుడు, గుల్లిపల్లి అర్జున, పైలా యువసేన మండల అధ్యక్షుడు గట్రేడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.










