Apr 09,2023 21:43

ప్రజాశక్తి - టి.నరసాపురం
              వైసిపి ప్రభుత్వం పెంచిన అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని టిడిపి పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు విమర్శించారు. మండలంలోని వెలగపాడులో ఆదివారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ధరలు తగ్గుతాయని అన్నారు. ప్రజలందరూ జగన్‌ పాలనపై విసుగు చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు టిడిపికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకటేశ్వరావు, నాయుడు రామకృష్ణారావు గౌడ్‌, ఆచంట అనిల్‌, సూర్యనారాయణ, తోట లక్ష్మీనారాయణ, జోనుబోయిన సోంబాబు, కొండపల్లి రవి, మెతుకుమిల్లి గోపాలరావు, గండబోయిన శ్రీను, అద్దంకి జగ్గారావు, కాసననేని మాధవరావు పాల్గొన్నారు.