Aug 24,2023 23:14

గుంటూరు జిల్లా ప్రతినిధి: వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడు తున్నారని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌ అన్నారు. గురువారం అర్బన్‌ పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లా డుతూ చంద్రబాబు పాలనతోనే ప్రజల కష్టాలు గట్టెక్కుతాయన్నారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని గాలికొదిలేసి అక్రమ ధనార్జన లక్ష్యంగా వైసిపి నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ రెడ్డి నిజాయితీగా గెలిచే ధైర్యం లేక అక్రమంగా ఓట్లను తొలగిస్తూ, దొంగ ఓట్లను సృష్టి స్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ మహాశక్తి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయిగా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కె. వెంకట్‌, టి.సుబ్బారావు, షేక్‌ కరిముల్లా, వై.నాగేశ్వరరావు, ఎస్సీ సెల్‌ నాయకులు రవి, బి.మధు, కె.శేఖర్‌, వై. రమేష్‌, బి.శివరాం, పి.రాము, నారాయణరెడ్డి, యు. శీను పాల్గొన్నారు