ప్రజాశక్తి - కశింకోట
వైసిపి ప్రభుత్వ పాలనలో పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని పరవాడపాలెం గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించి వాడుకుంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఒక్క కిలోమీటరైనా సిమెంట్ రోడ్డు వేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉగ్గిన రమణమూర్తి, కాయల మురళి, కలగా సోమేశ్వరరావు, నైనంశెట్టి రమణారావు, సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, సిద్ధిరెడ్డి సూర్యనారాయణ, సేనాపతి కృష్ణ, ఎంపీటీసీ బుద్దిరెడ్డి అప్పడు, ఉల్లింగల రమేష్, జెర్రిపోతుల నూకి నాయుడు, కరణం గోవిందా, మడక రమణ, మడక నాగేశ్వరరావు, దొప్పా రామోజీ, పరవాడ చిన రమణ, సేనాపతి శ్రీను పాల్గొన్నారు.










