ప్రజాశక్తి- మునగపాక రూరల్
వైసిపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టిడిపి ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆరోపించారు. మండలంలోని ఉమ్మలాడలో మంగళవారం రాత్రి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను తొలగించడం దారుణమన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విడదీసి పాలించాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మొల్లేటి నారాయణరావు, పల్లె రాజు, దొడ్డి శ్రీనివాసరావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, కొరపాటి వీర రాజశేఖర్, ముల్లేటి సత్యనారాయణ, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
అనకాపల్లి : సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం బుధవారం పట్టణంలోని చేపల బజారు, నెయ్యిల వీధి, ఉప్పలవారి వీధి, తోటకూర వీధి ప్రాంతాల్లో 84 వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి, నీలబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల రత్న కుమారి, కసిరెడ్డి సత్యనారాయణ, సాలాపు మోహన్ పాల్గొన్నారు.










