Oct 18,2023 16:33

'బాబుతో నేను' కార్యక్రమంలో సొంగ రోషన్‌ కుమార్‌
ప్రజాశక్తి - చింతలపూడి
   వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ, ఆర్థిక భద్రత లేకుండా పోయిందని చింతలపూడి టిడిపి నియోజకవర్గ యువనాయకులు సోంగా రోషన్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని అంతోనినగర్‌ గ్రామ మహిళలతో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు మూడు గ్యాస్‌ సిలీండర్లు టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. అలాంటి నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక భద్రత కల్పించిన చంద్రబాబు నాయుడుకి మేము మద్దతుగా ఉంటామని తెలియజేశారు.