'బాదుడే బాదుడు'లో మాజీ మంత్రి కిడారి ధ్వజం
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గడచిన మూడున్నరేళ్లలో ఏజెన్సీలో కనీస అభివృద్ధి జరగకపోగా, ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసి ఉన్నాయని మాజీ మంత్రి, అరకు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కిడారి శ్రావణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని పెదగూడ పంచాయతీ జరిపడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్గనైజర్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడారికి గ్రామస్తులు, స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిపడ గ్రామానికి గతంలో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హయాంలో రోడ్డు మంజూరైందని, నేటికీ అది పూర్తి చేయలేదన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికీ ఒక్క రోడ్డైనా వేసిన పాపాన పోలేదని, అనేక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు ఇలా అన్ని సమస్యలున్నా ఏ ఒక్కదాన్నీ వైసిపి ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. పాదయాత్రలో సిఎం జగన్ కుప్పులు తెప్పలుగా ఇచ్చిన హామీలు కనీసస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తేనే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కాంతులు వెల్లివిరుస్తాయన్నారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపి, వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయానికి అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బాకూరు వెంకటరమణరాజు, దారెల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి, వైస్ ప్రెసిడెంట్ మధు, అరడకోట వార్డు సభ్యుడు బాలకృష్ణ, మండల టిడిపి సీనియర్ నేతలు నీలకంఠ పాత్రో, చవిటియ గోపాల్, చెండా గోపాల్, కాగుపతి పడాల్, పెలామల చిరంజీవి, తంగుల మాణిక్యం, చైతోన్, కామేష్, గాంధీ, సింహాచలం, నాగేష్, రామో, పాత్రుడు, రామదాసు, ధనుంజయ, త్రినాథ్, అర్జున్, మధు, మండి ప్రభాకర్, గ్రామస్తులు పరుకొండి గోపాల్, గణపతి, మట్టం అనిల్‌కుమార్, సతీష్ పాల్గొన్నారు.










