ప్రజాశక్తి-హుకుంపేట:వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం అని, మారుమూల గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని టిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర అన్నారు. మండలంలోని మెరకచింత పంచాయతి కరకపుపుట్టు, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్యంలో అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు చేయడం చేతకాక సంక్షేమ పథకాల కోసం మాట్లాడటం సరికాదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని పేదోడి సొంతింటి కల గృహ నిర్మాణాలు, తారు రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించక పోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో టిడిపి హాయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వైసిపి హయాంలో అభివృద్ధి అన్న మాట ఎక్కడా కానరాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.










