
ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
వైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎంఎల్‌ఎ వేగుళ్ళ జోగేశ్వరరావు, అమలాపురం పార్లమెంటరీ టిడిపి ఇంచార్జ్ గంటి హరీష్ మాధుర్ అన్నారు. ఆదివారం కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి గ్రామంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు జగ్గం శెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటికి పర్యటించి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు వివరించారు. చంద్రబాబు మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ముత్యాల వెంకటరావు, బలవ రెడ్డి సత్తిబాబు, సాక శ్రీనివాస్ , కొప్పిశెట్టి వాసు, కుంచె ప్రసన్నకుమార్, మేక ప్రసాద్ తదితరులు, పాల్గొన్నారు.