Oct 16,2023 23:35

వైసిపి పాలనలో అభివద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

వైసిపి పాలనలో అభివద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ప్రజాశక్తి -దొరవారిసత్రం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివద్ధికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించి ప్రజల మన్ననలు పొందుతున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. సోమవారం దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సచివాలయ భవన నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.75 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పరిపాలన భవనం రైతు భరోసా కేంద్రం , వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ, చెంగాలమ్మ దేవస్థానం బోర్డు చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దువ్వూరు గోపాల్‌ రెడ్డి ఒక్కో భవనాన్ని ప్రారంభించి ఆయా శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత జగన్‌మోహన్‌్‌ రెడ్డిదేనని అన్నారు. ప్రధానంగా ప్రజల ఆర్థిక ప్రగతి తో పాటు అభివద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చారి, ప్రతి గ్రామ సచివాలయానికి ఒక కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం అభివద్ధి కాదా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ప్రజా సంక్షేమంలో అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటూ విద్యా విధానంలో కొత్త పుంతలు తొక్కుతూ పేదల వైద్యానికి భరోసా ఇస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రుల నూతన భవనాలకు ఒక్కో దానికి 5 కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేసి పనులు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 87 శాతం వరకు అభివద్ధి చేశామని గుర్తు చేశారు. ప్రజల సౌలభ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రజల వ్యయ ప్రయాసలకు, ఆర్థిక భారానికి గురికాకుండా గ్రామంలోనే అన్ని పనులు చేసుకునేందుకు అవసరమైన వైద్య సేవలు పొందేందుకు రైతుకు అవసరమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సేవలు పొందేలా సౌకర్యాలు కల్పించామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే ఆదర్శప్రాయంగా సచివాలయ భవన నిర్మాణం ఉందని, అతి త్వరగా నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేసిన మండల ఉపాధ్యక్షులు దువ్వూరు గోపాలరెడ్డిని ఎమ్మెల్యే సంజీవయ్య ప్రశంసించారు. చెంగాలమ్మ ఆలయ ఇన్‌చార్జి చైైర్మన్‌ బాలచంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రజాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారన్నారు. ఈ కార్యక్ర మంలో వైద్యాధికారి, చైతన్య, తహశీల్దార్‌ గోపీనాథ్‌ రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో రఘురామయ్య, సిడిపిఓ శారదదేవి స్థానిక సర్పంచ్‌ వాసిరెడ్డి రజని, వైసిపి నేతలు వేణుబాక మునస్వామినాయుడు, రమణారెడ్డి, వెంకటా చలంరెడ్డి, సురేష్‌ రెడ్డి పాల్గొన్నారు.