Dec 27,2022 23:40

మాట్లాడుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి-గొలుగొండ:వైసిపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. మండలంలో ఏటిగైరంపేటలో సోమవారం సాయంత్రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు, ఉపాధ్యాయులకు సిపిఎస్‌ రద్దుతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తుపాన్‌కు నష్టపోయిన అరటి రైతులకు హెక్టారుకు రూ.15వేలు ఇచ్చామని, వైసిపి ప్రభుత్వ హయాంలో గత ఏడాది తుపాన్‌కు నష్టపోయిన అరటి రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి తగిన బుద్ది చెప్పాలని అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, ఉపాధ్యక్షులు నల్లబెల్లి నూకరాజు, తెలుగు యువత మండల అధ్యక్షులు కర్రి నాయుడు, ఏటిగైరంపేట ఎంపిటిసి చింత కాంతం, సర్పంచ్‌ రామకృష్ణ, సీనియర్‌ నాయకులు కొల్లి సత్యనారాయణ, భీమిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
నర్సీపట్నంరూరల్‌:వైసిపి పాలనకు చరమగీతం పాడాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మండలం నీలంపేటలో మంగళవారం సాయంత్రం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసిపి పాలనలో అభివద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. టిడిపి హయాంలోని పలు పథకాలను రద్ధు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి సుకల రమణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.