Jan 08,2023 23:19

కార్యక్రమంలో పాల్గొన్న పివిజి.కుమార్‌, పైలా ప్రసాదరావు, టిడిపి కార్యకర్తలు

ప్రజాశక్తి- దేవరాపల్లి
రాష్ట్రంలో వైసిపి పాలనకు నూకలు చల్లే రోజులు దగ్గరపడ్డాయని టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌, నాయకులు పైలా ప్రసాదరావు అన్నారు. మండలంలోని గజపతినగరం, వడ్రపాలెం గ్రామాల్లో శనివారం రాత్రి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వడ్రపాలెం గ్రామంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేని దుస్థితిలో ఉందన్నారు. మంత్రి బూడి ముత్యాలనాయుడు గ్రామంలో స్టేజి, కమ్యునిటీ హాలు నిర్మిస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే వాటిని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రికి ప్యాకేజీలు కుదరకే వైద్య కళాశాల తరలింపు
అనకాపల్లి : రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ప్యాకేజీలు కుదరకపోవడం వల్లే వైద్య కళాశాలను నర్సీపట్నానికి తరలించారని మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. మండలంలోని బట్లపూడి, రాయుడుపేట గ్రామాల్లో ఆదివారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి వస్తే క్రిస్మస్‌, సంక్రాంతి, రంజాన్‌ పండగలకు చంద్రన్న కానుకలు వంటి 129 సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొణతాల రత్న కుమారి, జెర్రిపోతుల ఉమామహేశ్వరి శ్రీను, పండూరి రఘు, గండు బోయిన సత్తిబాబు, అనసూరి అప్పారావు, తలారి కాశీనాయుడు, కరణం రమణ, కరణం కోటి, రెండు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.