
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : రాష్ట్రంలో అభివృద్ది ఏవిధంగా జరుగుతుందనేదానికి ఆనవాళ్లు రోడ్లపై గుంతలని టిడిపి, వైసిపి నాయకులు ఎద్దేవా చేశారు. శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యాన మండలంలోని వెంకంపేటఘోరీల కూడలిలో పట్టణంలోని పాతబస్టాండులో రహదారి గుంతల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, జనసేన కన్వీనర్ ఎ.మోహనరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. రూ.10లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన సిఎం జగన్‌మోహనరెడ్డి ప్రాణాంతకంగా మారిన రహదారి గుంతలను కప్పే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. గుంతలుపడిన రహదారులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు బోను చంద్రమౌళి, గొరజాన చంద్రమౌళి, పట్టణ అధ్యక్షులు జి.రవికుమార్, కౌన్సిలర్లు కెనారాయణరావు, టివెంకటరావు, కోల మధుసరిత, జనసేన నాయకులు చందక అనిల్‌కుమార్, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని జోగింపేట-ఇప్పులవలస గ్రామాల మధ్య పాడైపోయిన రోడ్డును బాగు చేయాలని టిడిపి, జనసేన నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు కె.తిరుపతిరావు, ఆర్.వేణునాయుడు, నాయకులు బొమ్మనేని లక్ష్మణరావు, ఎస్.శ్రీనివాసరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం :గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదంటూ మండలంలోని మండ గ్రామ సమీపంలో గుంతలు పడ్డ రాష్ట్ర రహదారి వద్ద వద్ద తెలుగుదేశం-జనసేన పార్టీల నాయకులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ వైసిపి నాలుగున్నరేళ్లలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు పాడి సుదర్శన్‌రావు, అరకు పార్లమెంటు ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు,అరకు పార్లమెంటు ఎస్టీసెల్ కార్య నిర్వాహక కార్యదర్శి తాడంగి రామారావు, క్లస్టర్ ఫోర్ వెంకటరావు, లుంబేసు గ్రామ కమిటీల అధ్యక్షులు తోయక కామేశ్వరరావు, కొండలరావు కొండవాడ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్, బూత్ ఇంచార్జ్ మండంగి త్రినాద్ దొర, టిడిపి, జనసేన నాయకులు హాజరయ్యారు.
కొమరాడ : స్థానిక అంతర్ రాష్ట్ర రహదారిపై అధ్వానమైన రోడ్ల దుస్థితిని ప్రజలందరికీ అర్థమయ్యేలా డిజిటల్ క్యాంపెనింగ్ రూపంలో తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన చేపట్టారు. జనసేన మండల అధ్యక్షులు తెంటు శ్రీకర్, తెలుగుదేశం మండల అధ్యక్షులు సేనాపతి ఉదరు శేఖర్ పాత్రుడు గోతులు వద్ద నిరసన తెలుపుతూ వైసిపి ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దేవకోటి వెంకటనాయుడు, నంగిరెడ్డి మధుసూదన్‌రావు, గులిపల్లి సుదర్శన్, పొట్నూరు వెంకటనాయుడు, సత్యనారాయణ, జగదీష్, భానుజీ తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని పార్వతీపురం నుంచి శ్రీకాకుళం రహదారిలో ఉల్లిభద్ర సమీపాన ఏర్పడ్డ గుంతల వద్ద టిడిపి, జనసేన నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బిసి విభాగం కార్యదర్శి ఎం.తవిటినాయుడు, అరకు పార్లమెంట్ జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి ఎంబి విజయ అంకుశం. కార్యదర్శి పూర్ణచంద్రరావు. అరకు పార్లమెంట్ బీసీ విభాగం ఉపాధ్యక్షులు అంబటి రాంబాబు, తెలుగు యువత ఉపాధ్యక్షులు కోట సుమన్ భరత్, బచ్చ జగదీష్, ఎం.కృష్ణంనాయుడు, ఎం.నారాయణస్వామి, ఎం.రామారావు, వై.శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కురుపాం : టిడిపి -జనసేన ఉమ్మడి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది అనే కార్యక్రమం స్థానిక ప్రధాన బస్ స్టాండ్ వద్ద ఉన్న గుంతను చూపిస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్ కోలా రంజిత్, జనసేన నాయకులు నేరేడుబిల్లి వంశీ, టిడిపి నాయకులు నందివాడ కృష్ణబాబు, కె.రామరాజు, కర్రి శ్రీను, చంటి, త్రినాథ, రాజేష్, గవరయ్య , విజరు తదితరులు పాల్గొన్నారు.
భామిని : మండలంలోని సింగిడి వద్ద పాలకొండ నియోజకవర్గ టిడిపి నాయకులు పడాల భూదేవి, జనసేన ఇన్చార్జ్ నిమ్మల నిబ్రహం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్లు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్‌ఎస్ ప్రకాశరావు, అంగూరు దశరధనాయుడు, వై.శ్రీనివాస్, కె.రాజారావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.