Oct 18,2023 19:12

పడాల అరుణను అభినందిస్తున్న జనసేన నాయకులు

ప్రజాశక్తి-గజపతినగరం :  జనసేన, టిడిపి కలయికతో జిల్లాలోను, రాష్ట్రంలోను వైసిపి పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. జనసేన పిఎసి సభ్యురాలుగా నియమితులైన పడాల అరుణను బుధవారం గురాన అయ్యలు ఆధ్వర్యంలో కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వం కొనసాగిస్తున్న ధమనకాండ నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాడ మోహన్‌ రావు, డి.రామచంద్రరాజు, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.