![](/sites/default/files/2023-11/ppm%20tdp.jpg)
సమావేశంలో మాట్లాడుతున్న జనసేన, టిడిపి నాయకులు
ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీల గెలుపునకు కృషి చేయాలని, వైసిపి ఓటమికి నడుంకట్టాలని జనసేన పార్టీ కో ఆర్డినేటర్ లోకం మాధవి కోరారు. పార్వతీపురం నియోజక వర్గంలోని టిడిపి- జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు పార్టీలు కలిసి పోరాటం చేసి ప్రజాస్వామ్యానికి కూనీచేసిన వైసిపిని గద్దె దించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి జగదీష్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజరు చంద్ర, జనసేన సమన్వయకర్త ఎ.మోహనరావు, పార్వతీపురం,సీతానగరం మండల టీడీపీ నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, బోను దేవీచంద్రమౌళి, జి.చంద్రమౌలి, కొల్లి తిరుపతిరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.