ప్రజాశక్తి-చింతూరు
అధికార వైసిపి విధి విధానాలు నచ్చక మండలంలోని వాలుమూరు గొంది గ్రామానికి చెందిన ఆ పార్టీకి చెందిన సోడే రామ్ శెట్టి, పాయం శంకరయ్య, నాగరాజు ఆధ్వర్యాన 15 కుటుంబాల వారు సిపిఎంలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోడే రామ్ శెట్టి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గిరిజన చట్టాలు అమలు కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని చెప్పారు. అధికార వైసిపి నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని విమర్శించారు. ఆదివాసీలకు సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వైసిపి మూడున్నరేళ్ల పాలనలో గ్రామ సమస్యలు పరిష్కారం చేయలేదని, అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యబెట్టారని తెలిపారు. సిపిఎంలో చేరిన వారిలో సోడే సూరిబాబు, సోడే నాగయ్య, కృష్ణ కుమార్, పాయం శంకరయ్య, సోడే కన్నయ్య, సోడే చిన్న కన్నయ్య, పండా నాగరాజు, వెట్టి రాములమ్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కుంజా సీతారామయ్య, పల్లపు వెంకట్, మండల నాయకులు సీసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మడకం చిన్నయ్య, మొర్రం రంగమ్మ, కలుముల మల్లేష్, వీరయ్య కనుమల లక్ష్మయ్య, పాండురంగయ్య, సుబ్బారావు, కారం కొండయ్య, పల్లపు రాములు, తెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










