Aug 28,2023 19:26

ఇసుక డంపు వద్ద నిరసన తెలియజేస్తున్న డోన్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

వైసిపి నేతలు ఇసుక దోపిడి
- డోన్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
ప్రజాశక్తి-డోన్‌

రాష్ట్రంలో వైసిపి నాయకులు చేస్తున్న ఇసుక అక్రమ మైనింగ్‌ లపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం డోన్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఇసుక డంపింగ్‌ యార్డ్‌ నందు డోన్‌ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ,టిడిపి నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశంపార్టీ హయాములో ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి నుండి నేడు జగనన్న కాలనీలకు ఇస్తున్న ఇసుక స్టాక్‌ పాయింట్‌ అని చెబుతూ డోన్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో ఆర్థికమంత్రి బుగ్గన అక్రమంగా ఇసుకను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. జెపి వెంచర్‌కు కాంట్రాక్టు మే 13వ తేదీకి ముగిసినా నేటికీ అక్రమంగా ఇసుకను చేతి రాత రసీదులు ఇచ్చి ప్రభుత్వాన్ని లూఠీ చేస్తున్నారని అన్నారు. తక్షణమే ఇసుక దోపిడీ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, డోన్‌ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామ సుబ్బయ్య, నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్‌ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున,నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు,రైతు కమిటీ ఉపాధ్యక్షులు సత్యం తదితరులు పాల్గొన్నారు.