Mar 20,2023 16:28

వైసిపి నాయకులు కాటసాని సుంకిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

వైసిపి నాయకుని మృతి

నివాళులర్పించిన ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి బనగానపల్లె
      మండలంలోని మిట్టపల్లె గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కాటసాని సుంకిరెడ్డి( 63 ) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నంద్యాల ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం మండలంలోని మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు కాటసాని సుంకిరెడ్డి మృతి చెందడంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డిలు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ కాటసాని సుంకిరెడ్డి కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు కాటసాని పెద్ద రామకృష్ణారెడ్డి, కలవాయి చంద్రశేఖర్ రెడ్డి, కాటసాని ప్రకాశ్ రెడ్డి ,ఎన్ నాగిరెడ్డి, కాటసాని నాగిరెడ్డి, కాటసాని చిన్న రామకృష్ణారెడ్డి, కానాల రామ సుబ్బిరెడ్డి, గుండం సురేష్ కుమార్ రెడ్డి, గుండం సర్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.