ప్రజాశక్తి-రేపల్లె : వైసిపి నాయకులు అరాచక శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి నాయకులు ప్రజాస్వామ్యా విలువలకు పాతరేస్తూ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. మండల పరిధిలోని చెన్నుపల్లి వారిపాలెంలో జనసేన పార్టీ కార్యకర్తలు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్లెక్సిని తొలగించక పోతే మీ అంతుచూస్తామని బెదిరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్, మండల అధ్యక్షుడు ఆర్. జానకయ్య, ఉపాధ్యక్షుడు జీ.లక్ష్మణరావు, సర్పంచి ఎం. జయరామయ్య, పవన్ కళ్యాణ్, రాజశేఖర్ పాల్గొన్నారు.










