
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ భోగాపురపు లక్ష్మి నివాసంలో గురువారం ఉదయం వైసిపి నాయకులతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి భేటీ అయ్యారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వార్డులో సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని తెలిపారు. సమావేశంలో డివిజన్ ఇన్‌ఛార్జి భోగాపురపు రవిచంద్ర, వైసిపి డివిజన్ అధ్యక్షులు ఆర్లె కృష్ణారావు, రెడ్డి నాయకులు గురుమూర్తి, బాల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకూ కోలగట్ల
3వ డివిజన్ పూల్ బాగ్, వాడ వీధి జంక్షన్ నుండి ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. వాడవీధి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఇళ్లకు ఇంటి పన్ను విధించలేదని స్థానికులు చెప్పడంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మేయరు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కోలగట్ల కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక కార్పొరేటర్ వజ్రపు సత్య గౌరీ, వైసిపి నాయకులు మెండా రమణ, వజ్రపు శ్రీను, వేమూరి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.