మాట్లాడుతున్న వైసిపి నాయకులు
ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరులో జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కందుకూరు వైసిపి నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. ఈఘటన అత్యంత విషాదాన్ని కలిగిచిందని, విలువైన కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఓదార్పు చేకూరాలనీ ఆకాంక్షించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. రావులకొల్లు బ్రహ్మానందం, గంగవరపు.వెంకట్రావు, ఆవులమాధవరావు ,వి.కొండారెడ్డి, ముప్పవరపు కిషోర్, పెంచెల రెడ్డి, చనమాల కోటేశ్వరరావు, ఇంటూరి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.










