ఎంపీ మోపిదేవితో నజీర్ అహ్మద్
ప్రజాశక్తి-నిజాంపట్నం: వైసీపీ బాపట్ల జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా బావోజీపాలెం సర్పంచ్ మహ్మద్ నజీర్ అహ్మద్ నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ సోమవారం రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావును నిజాంపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మోపిదేవి మాట్లాడుతూ యువకుడు, విద్యావం తుడైన మహ్మద్ నజీర్ అహ్మద్‌ను అధిష్టానం గుర్తించి జిల్లా మైనార్టీ విభాగానికి అధ్యక్షుడిగా అవకాశం కల్పించటం జరిగిందన్నారు. పార్టీ బలోపేతానికి నజీర్ అమ్మద్ కృషి చేయాలని చెప్పారు. అనంతరం నజీర్ ఎంపీ మోపిదేవి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. తన నియామకా నికి కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావుకు, వైసీపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.










