ప్రజాశక్తి-మెంటాడ : వైసిపి ఆధ్వర్యాన సాలూరులో నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సందర్భంగా బుధవారం పోరాం నుంచి సాలూరు వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, జెడ్‌పిటిసి లెంక సన్యాసి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకు సమన్యాయం చేయాలని సంకల్పించి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ కుంటినవలసలో గిరిజన యూనివర్శిటీ నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారని, దీనివల్ల గిరిజనులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనులకు ఒక్క పథకం కూడా ఇవ్వలేద న్నారు. కార్యక్రమంలో సామాజిక సాధికారక బస్సుయాత్ర ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు, జిసిసి చైర్‌పర్సన్ స్వాతీరాణి, ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, వైస్ ఎంపిపిలు సారికి ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ , సచివాలయం మండల కన్వీనర్ కనిమెరక త్రినాధరావు, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అప్పలనాయుడు, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.