Jul 29,2023 21:48

వైసిపి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బొత్స, పక్కన రాజన్నదొర, పరీక్షిత్‌రాజు

పార్వతీపురంటౌన్‌: వైసిపి జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. పట్టణంలోని బైపాస్‌రోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనంలో పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బొత్సతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ సభ్యులు పాలవలస విక్రాంత్‌, కురుపాం, పాలకొండ, పార్వతీపురం, ఎమ్మెల్యేలు పి.పుష్ప శ్రీవాణి, వి.కళావతి, అలజంగి జోగారావు, రాష్ట్ర బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిధిలో గల ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, వైసిపి సీనియర్‌ నాయకులు సమక్షంలో పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించి పరీక్షిత్‌ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బొత్సకు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసిపి ప్రజా ప్రతినిధులు, కన్వీనర్లు, వైసిపి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించాలి
అనంతరం విలేకరులతో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు వర్గాల్లో వైసిపి అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఇదే మనం ముఖ్యమంత్రికి ఇచ్చే బహుమతని, ఆ దిశగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.