May 01,2023 20:17

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి

వైసిపి ఇంటికి పోవడం ఖాయం
: మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇంటికి పోవడం ఖాయమని శ్రీశైల నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపంలో వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు మండలాలు చెందిన టిడిపి మండల బూత్‌ కన్వీనర్లు యూనిటీ ఇన్చార్జిలో క్లస్టర్లు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. శ్రీశైలం నియోజవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధిపై సంవత్సరం కిందట సవాలు విసిరితే నేటికీ స్పందించడం లేదన్నారు. నియోజకవర్గంలో వైసిపి సీటు గల్లంతు అవుతున్నదని పీకే టీం రిపోర్ట్‌ ఇప్పటికే ఇచ్చిందని అన్నారు. నారా లోకేష్‌ పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో పదో తేదీ తర్వాత ఉండవచ్చునని ఆయన అన్నారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం వద్ద పది తలల జగనాస్తుర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.