Nov 16,2023 22:58

ప్రజాశక్తి-భవానీపురం: ప్రజలకు మంచి చేసేందుకు జగనన్న కావాలని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం పశ్చిమ నియోజకవర్గంలో 34, 37, 38 డివిజన్లలో జరిగిన ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాల్లో వెలంపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి సచివాలయంలో అమర్చిన పేదలకు చేకూర్చిన లబ్దిని వివరించే బోర్డును ఆవిష్కరించి, సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన జండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పెద్దలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగనన్న చేసిన మంచిని ప్రజలకు తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలలో 60 హామీలు కూడా అమలు చెయ్యలేదన్నారు.నేడు జగనన్న ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ బండి పుణ్యశీల రాజ్‌ కుమార్‌, 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ మండేపూడి చటర్జీ, షేక్‌ రహమతున్నిసా, మనోజ్‌ కొఠారి, తనుబుద్ది చంద్రశేఖర రెడ్డి, యశోధర్‌, కేసరి కష్ణారెడ్డి, గ్రంధిబుజ్జి, మాబు, వంశీ జిలానీ, బొమ్ము మధు, కల్వకోల్లు దుర్గారావు, సయ్యద్‌ అతీక్‌ పాల్గొన్నారు.
31 వేల మందికి ఇళ్లస్థలాల పంపిణీ
పశ్చిమ నియోజకవర్గంలో 31వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం జరిగిందని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం స్థానిక 39వ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాలలో వెలంపల్లి శ్రీనివాసరావు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొన్నారు. డివిజన్‌లో జరగాల్సిన అభివద్ది పనుల గురించి అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా 11 ట్యాంకులు నిర్మాణానికి కషి చేశామన్నారు. గతంలో కంటే ఇప్పుడు అభివద్ది చేస్తున్నామన్నారు. అలాగే 39వ డివిజన్‌ అభివద్ది కొరకు అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, స్థానిక 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుడివాడ నరేంద్ర రాఘవ,కొత్తమాసు వెంకట పిచ్చయ్య, ఏలూరు వెంకన్న, జూలూరి నాగభూషణం, డివి. రెడ్డి, బోండా సాంబశివరావు, పి.భాస్కర్‌, ఆర్‌.వెంకట్‌, ముంతాజ్‌ బేగం, నాగమణి, కటన్‌ కరిముల్లా, కరిం, రేలంగి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.