Nov 03,2023 21:56

మినీమేనిఫెస్టో కరపత్రాన్ని మహిళకు అందజేస్తున్న కందికుంట

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని టిడిపి నాయకులు విమర్శించారు. పట్టణంలోని 38వ వార్డులో శుక్రవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు, మినిమ్యానిపేస్టో గురించి ప్రజలకు వివరించారు. అక్రమ కేసులో చంద్రబాబును నిర్బందించి జగన్‌ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. జగన్‌ నియంతపాలనలో ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే తగిన బుద్దిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీతామూర్తి, అత్తర్‌ రహీంబాషా, బిల్లేశీన, మున్నీ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో కందికుంట పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరుగుతూ మినీమేనిఫెస్టో కరత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు డైమండ్‌ ఇర్ఫాన్‌, వార్డు ఇన్‌ఛార్జి హైదర్‌ వలి, యూనిట్‌ ఇన్‌ఛార్జి ముస్తఫా, మాజీ మహిళ కమిషన్‌ సభ్యురాలు పర్వీన్‌బాను, గంగరత్నమ్మ, ప్రేమలత, కుమారి,సుశీల, తెలుగుయువత పట్టణ అధ్యక్షులు కాటం మనోజ్‌, నాయకులు జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.