
ప్రజాశక్తి - ఉండి
వైసిపి పాలనలోనే మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, సంక్షేమ పథకాలన్నీ మహిళలకే అనుసంధానం చేసి ఇస్తున్నారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు అన్నారు. ఉండి కూనపరాజు సీతమ్మ అప్పలరాజు లయన్స్ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పివిఎల్.నరసింహరాజు పాల్గొని అర్హులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, ఉప సర్పంచి కల్యాణ్ వర్మ, రూరల్ బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.
పెనుమంట్ర :అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మండలంలోని కొయ్యేటిపాడు, సత్యవరం గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం మంగళ వారంతో ముగిసింది. ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ సత్యవరం గ్రామంలో 605 కుటుంబాలకు 867 సర్టిఫికెట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్యేటిపాడు సర్పంచి కర్రి మునిరామకృష్ణారెడ్డి, సత్యవరం సర్పంచి చుక్కా అప్పారావు, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి పాల్గొన్నారు.
గణపవరం :ప్రజా సమస్యలను సచివాలయ పరిదిలోనే పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. మండలంలోని మొయ్యేరు సచివాలయం వద్ద సర్పంచి కుటుంబరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష సభలో ఎంఎల్‌ఎ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు దండు వెంకటరామరాజు, వైఎస్‌ఆర్ మండల కన్వీనర్ దండు రాము, ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి, తహశీల్దార్ పి.లక్షి, డిటి ఎం.సన్యాసిరావు, ఎంపిటిసి సభ్యులు ద్వారపూడి లక్షివిజయ పాల్గొన్నారు.
పాలకోడేరు :మండలంలోని విస్సాకోడేరు, శృంగవృక్షం గ్రామాల్లో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. విస్సాకోడేరులో నిర్వహించిన కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు పాల్గొని లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి భూపతి రాజు చంటిరాజు, సర్పంచి బొల్లా శ్రీనివాస్ శృంగవృక్షం సర్పంచి జంగం సూరిబాబు, తహశీల్దార్ షేక్ హుస్సేన్, ఎంపిడిఒ మురళి గంగాధరరావు, ఆర్‌ఐ నాగభూషణరావు పాల్గొన్నారు.
మొగల్తూరు : ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు చేరుస్తామని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని జగన్నాధపురం, కెపిపాలెం నార్త్ గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ధ్రువపత్రాలు అందించారు.