ప్రజాశక్తి - ఉంగుటూరు
రానున్న ఎన్నికల్లో వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చేలా అందరకూ కృషి చేయాలని ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. మండలంలో గృహసారధులు, సచివాలయ కన్వీనర్లతో గురువారం గోపీనాథపట్నం కల్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని, సెల్‌ఫోన్లకు ముఖ్యమంత్రి స్టిక్కర్లు అంటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపీనాథపట్నం సర్పంచి, సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు పి.విష్ణుమూర్తి, పార్టీ మండల కన్వీనర్ మరడ వెంకటమంగారావు, ఉంగుటూరు -1 ఎంపిటిసి డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, జెడ్‌పిటిసి సభ్యులు కె.జయలక్ష్మి, ఎఎంసి మాజీ ఛైర్మన్ మరడ రమావతి, నారాయణపురం సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్‌పర్సన్ పాపారావుబాబ్జీ, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.










