ప్రజాశక్తి- ఆనందపురం : రానున్న ఎన్నికలలో వైసిపి విజయమే ధ్యేయంగా సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, పార్టీ నాయకులు పనిచేయాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ పరిశీలకులు పి.బాలరాజు అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌లో సచివాలయ కన్వీనర్లు, పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉంటారని, వారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపునకు కృషి చేయాలన్నారు. వాలంటీర్లు, పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ నిర్ధేశించిన లక్ష్యం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో భీమిలి వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్, జెడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, పార్టీ అధ్యక్షుడు బంక సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, పెదబాబు, గాడు వెంకటప్పడు, గాడు శ్రీను, బి మణిశంకరనాయుడు, బోనీ అప్పలనాయుడు, గంగిరెడ్డి శ్రీను, కాకర వెంకటరమణ, రౌతు శ్రీను, మూడు మండలాల నేతలు పాల్గొన్నారు










