Feb 27,2023 19:47

ఎమ్మెల్సీ అభ్యర్థుల కరపత్రాన్ని చూపిస్తున్న ఎమ్మెల్యే

వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - కొత్తపల్లి

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి మద్దతుదారుల గెలుపు కోసం వైసిపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, పింఛన్‌ పంపిణీలో గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు తప్పనిసరిగా పాల్గొనాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కొత్తపల్లిలో జగనన్న కన్వీనర్స్‌ సిస్టమ్‌ మండల ఇన్చార్జి జిఎండి రఫీ ఆధ్వర్యంలో మండల నాయకులకు, కార్యకర్తలకు గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త మొదలుకొని ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలన్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయాలకు ప్రతి ఒక్కరు సమిష్టితో కృషి చేయాలని సూచించారు. వైసిపి గ్రాడ్యుయేషన్‌ అభ్యర్థి వెన్నపూస రవీంద్రనాథ్‌ రెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు శ్రీనాథ్‌ రెడ్డి, సర్పంచ్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ యాదవ్‌, కలుబండి మారెన్న, నక్క విజయకుమార్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాసులు, వైసిపి నాయకులు సాయిరాం, ప్రసాద్‌, సుబ్బన్న, ఓబులేసు, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.