Oct 07,2023 01:05

ప్రజశక్తి - చీరాల
వైసిపి డాక్టర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఐ బాబురావు నియమితులయ్యారు. వైసిపి కేంధ్ర కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అంబేద్కర్ ఐడియాలజీ ఫోరం, రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించిన వైసిపి బాధ్యతలు అప్పగించటం హర్షణీయమని పలువురు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం వైసిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని వైద్య సేవలు అందించారు.