రాయచోటి : గడిచిన నాలుగేళ్లల్లో రాష్ట్రంలో అవినీతి అరాచక అసమర్థ పాలనను సాగిస్తున్న వైసిపి దౌర్జన్యాలపై సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 ఎన్నికలే లక్ష్యంగా టిడిపి గెలుపు కోసం సోషల్ మీడియా ప్రతినిధులు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని బోస్ నగర్‌లోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పో యిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసిపి నేతల దౌర్జన్యాలు, భూకబ్జాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, డ్రగ్స్ మాఫియా, వైన్ మాఫియాగా రాష్ట్రం అవతరించిందన్నారు. రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఎక్కడే కానీ అభివద్ధి జరిగినా దాఖలాలు లేవన్నారు. 2019 డిసెంబర్‌లో పట్టణంలో అండర్ డ్రెయినేజీని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పారని, ఇప్పటివరకు మున్సిపాలిటీలో అండర్ డ్రెయినేజీ ఊసే లేదని తెలిపారు. వెలిగల్లు ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నప్పటికీ కాలువలకు నీళ్లు విడుదల చేయకపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టులో ఉన్న నీరు ఉన్న కాలువలకు రాకపోవడం అప్పట్లో కాలువలు పనులు చేసిన కాంట్రాక్టర్లు, ప్రస్తుత ఎంపీ మిధున్‌రెడ్డి పుణ్యమా అని కాలువలు తెగిపోయి పనులు నాశరకంగా చేపట్టడంతో కాలువలు తెగిపోయి ఆయకట్టు భూములకు సాగునీరు అందని పరిస్థి తులు నెలకొన్నాయని చెప్పారు. కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసి వైసిపి నాయకులు పనులు చేసుకు నేందుకు అవకాశం కల్పించిందే తప్ప దానివల్ల రైతులకు ఒరిగింది శూన్యం చెప్పారు. నియోజకవర్గంలో వైసిపి నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలు ఎక్కువ అయిపో యాయన్నారు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.1500లు ఉండేదని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.4000 పైగానే ధర పలుకుతోందని తెలిపారు. సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితులు కూడా నేడు లేవన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష, తెలుగు యువత అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, రామ్‌భూపాల్‌రెడ్డి, ఐటిడిపి నాగేంద్ర, కొవ్వూరు దివ్య కుమార్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి మల్లు నరసారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మద్దిరేవుల రమేష్‌రెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, అతావుల్లా, గుర్రం సుబ్బయ్య నాయుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు సత్యారెడ్డి, మాధవరం రమణారెడ్డి, చిట్లూరు గౌడ్, మాజీ సర్పంచులు బసయ్య, జిలానిబాష, టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కూనాసి సుబ్బరాజు యాదవ్, మల్లు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, సాయి పాల్గొన్నారు.సమావేశంలో










