వైసిపి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజాశక్తి - పాములపాడు
గత నాలుగు సంవత్సరాల వైసిపి అరాచక పాలనను ప్రజలేకి తీసుకెళ్లాలని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, నందికొట్కూరు టిడిపి పరిశీలకులు జి మురళి, నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి జయసూర్యలు అన్నారు. సోమవారం పాములపాడులో టిడిపి కార్యాలయాన్ని టిడిపి జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. మహిళల తాలులు తెగిపోతున్నాయని, మద్యపానాన్ని నిషేధం చేస్తానని నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతు న్నారన్నారు. ఎన్నికల ముందు ప్రజల కష్టాలు నేను విన్నానని చెప్పి జగన్ ఏం చేశారని అన్నారు. నందికొట్కూరు తాలూ కాలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, పుష్కరాలు సమ యంలో రోడ్లు వివిధ అభివృద్ధి పనులన్నీ టిడిపి హయా ంలోనే జరిగాయన్నారు. టిడిపి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల టిడిపి కన్వీనర్ వెంకటేశ్వర్లు, పగిడ్యాల మండల టిడిపి కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, టిడిపి మండల నాయకులు తిమ్మారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, బి వెంకటేశ్వరరావు, గోవిందు, మధు, కృష్ణ, చంద్రశేఖర్, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు బషీర్ అహ్మద్, అబ్దుల్, ఆఫీస్ సురేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాత మండల కన్వీనర్లు కొనసాగింపు: టిడిపి మండల కన్వీనర్‌గా హరినాథ్ రెడ్డినే కొనసాగిస్తున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ తెలి పారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం పాతవారి కొనసాగుతారని పైనుండి ఆదేశాలు వచ్చాక మార్పులు జరుగుతాయని వారు తెలిపారు.










