ప్రజాశక్తి-సబ్బవరం
వైసిపి ప్రభుత్వ అవినీతిని, అరాచక పాలనపై పోరాటానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. టిడిపి చేపడుతున్న 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమంగా పని చేసి జయప్రదం చేయాలన్నారు. మండలంలోని ఇరువాడ జిఎస్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన పెందుర్తి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు, నియోజకవర్గం నాయకులు పైలా జగన్నాదరావు, ఎం.నీలబాబు, రెడ్డి నారాయణరావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, పిబివిఎస్‌ఎన్ రాజు, భరణికాన సాయినాధరావు, రేసుపూడి రమణ, దొడ్డి సూర్యప్రకాష్, పల్లా తాతారావు, గండి దేముడు, బొండా సత్యారావు, కోటాన అప్పారావు, దెడ్డము ప్రసాదరావు, దాసరి వెంకట రమణ, అక్కిరెడ్డి దుర్గి నాయుడు, తమరాన బంగారు నాయుడు, గొర్లి కృష్ణ చైతన్య, బోకం సత్యనారాయణ, ఆడారి నాగరాజు, సీరం అప్పలరాజు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, ఆకుల గణేష్, బుదిరెడ్ల కనకరాజు, బొండా రాజు, వంగలపూడి సంతోష్ బాబు పాల్గొన్నారు.
అనకాపల్లి : జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.










