ప్రజాశక్తి-ఆలూరు
రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనను అంతం చేద్దామని టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి నారాయణ, వాల్మీకి సాధికారత కమిటీ జిల్లా కన్వీనర్ భాస్కర్ నాయుడు కోరారు. శనివారం వారు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, దాడులు పెరిగి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తుపై గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలు భరోసా కల్పిస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి జిల్లా నాయకులు నాగరాజు, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, గూళ్యం రామాంజినేయులు, హనుమప్ప, బి.శివ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నారాయణ










