Aug 11,2023 20:56

జడ్‌పి సిఇఒకు వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్సీ రవి

కడప అర్బన్‌ : వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే ఏకగ్రీవానికి వైసిపి నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవి పేర్కొ న్నారు. టిడిపి సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ తీసు కోకుండా ఇబ్బంది పెడుతున్న ఎంపిడిఒపై చర్యలు తీసు కోవాలని జడ్‌పి సిఇఒకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇడుపులపాయ సర్పంచ్‌ ఎన్నికలకు టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటి పన్ను కట్టలేదని, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా ఎంపిడిఒ మల్లికార్జున్‌రెడ్డి అడ్డుప డుతున్నారన్నారు. ఒక వారం ముందే సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పడం అడ్డంకులు కాదా అని ప్రశ్నించారు. జగన్‌ సొంత నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థి నామినేషన్‌ కు స్క్రూటిలో ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే జగన్మోహన్‌రెడ్డి భయపడినట్లే అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిస్తే సొంత నియోజకవర్గంలో ఓడిపోయామని జగన్‌కు భయం పట్టుకుందన్నారు. ఎలాగైనా వైసిపి అభ్యర్థి ని ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు.