ప్రజాశక్తి-జగ్గయ్యపేట : పట్టణంలోని కాకాని నగర్ కు చెందిన గజ్జ హేమంత్, గజ్జ వేణు అదేవిధంగా ధనంబోర్డుకి చెందిన విగేష్, అశోక్ లు ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ఆయన తనయులు, నియోజకవర్గ యువ నాయకులు సామినేని వెంకట కష్ణ ప్రసాద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ (బాజీ), మండల పార్టీ అధ్యక్షులు మండవ శ్రీనివాస్ గౌడ్, పాటి సాంబ తదితర నాయకులు పాల్గొన్నారు.










