Dec 13,2022 22:23

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకందని జీతాలు
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
వైసీపీ పాలనలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందని.. ఏ గ్రామానికెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని..'ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి' అని అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారని నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్‌ అన్నారు. మంగళవారం నిండ్ర మండలం కచ్చరవేడు, మేళంబాకం పంచాయతీలలో 'ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు, పంటలకు గిట్టుబాటు ధరలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమెర్జెన్సీ వాతావరణం ఉందని..
విపరీతమైన అప్పులు చేసి నెట్టుకొచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి కనబడటం లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి విజరుకుమార్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షులు దశరధ వాసు, శేఖర్‌, రమేష్‌, వెంకటపతిరాజు, షణ్ముగం, శ్రీరాములురెడ్డి, సుబ్బారావు, నవీన్‌, దొరస్వామినాయుడు, ఎ.జె.రవికుమార్‌, వడివేలురెడ్డి, సంపూర్ణమ్మ, బాబు, కోటి, జగన్‌, వెంకటేసులునాయుడు, సురేష్‌, పార్లమెంటరీ బీసీసెల్‌ అధ్యక్షులు షణ్ముగరెడ్డి, జీవరత్నంనాయుడు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదేమి ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమంలో భానుప్రకాష్‌