Jul 08,2023 00:13
ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న కర్లపాలెం ఎంపిడివో దాసరి రాంబాబు

ప్రజాశక్తి-కర్లపాలెం: అర్హులైన నిరుపేదలకు వైసీపీ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని కర్లపాలెం ఎంపిడివో దాసరి రాంబాబు అన్నారు. శుక్రవారం కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జగనన్న సురక్ష ప్రత్యేక అధికారి సైదా నాయక్‌, సర్పంచ్‌ గుర్రపసాల వెంకటేశ్వరమ్మ, బోలయపాలెం సర్పంచ్‌ కేసన లక్ష్మి, నాగరాజుపాలెం సర్పంచ్‌ షేక్‌ మస్తాన్‌ బీ, డిటి సలీమా, సూపరింటెండెంట్‌ ఫైజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.