Nov 22,2023 00:52
రోడ్లను పరిశీలిస్తున్న టిడిపి జనసేన నాయకులు

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారని, ఇక గ్రామీణ రోడ్ల బాగోగులు ఎవరు పట్టించుకుంటారని వైసీపీ ప్రభుత్వంపై హనుమంతుని పాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వేములపాడు, హనుమంతునిపాడు గ్రామాల పరిధిలో రోడ్ల పరిస్థితిని టిడిపి జనసేన సంయుక్తంగా కలిసి వెళ్లి పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారిని చూస్తే నరకానికి వెళ్లే దారిలాగా మారిందని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి దోచుకోని దాచుకోవడంలో ముందడుగు వేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిలో వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ప్రమాదం జరిగితే సమయానికి 108 కూడా వెళ్లలేని దుస్థితిలో రోడ్లు ఉన్నాయన్నారు. రోడ్లన్నీ గులకరాళ్లు తేలి అధ్వానంగా మారాయని అన్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ ఘనకార్యమేనని ఎద్దేవా చేశారు. కంకర తేలిన రోడ్లపైనే ప్లకార్డుతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గాయం తిరుపతిరెడ్డి, మురహరి నరసయ్య, గాయం రామిరెడ్డి, చీకటి వెంకట సుబ్బయ్య, గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, కోటపాటి శేషయ్య, గాయం కృష్ణారెడ్డి, మాసిపోగు ఎర్రయ్య, సర్పంచ్‌ బ్రహ్మారెడ్డి, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఆకుపాటి వెంకట్రావు, చావలి వెంకటేశ్వర్లు, బలసాని కోటయ్య, పెంచికల రామకృష్ణ, మొర శశికాంత్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.