ప్రజాశక్తి-చీరాల: వైసిపి జనసేన శ్రేణుల మధ్య గురు వారం సాయంత్రం మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇటీవల వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు అని అందుకు నిరసనగా బుధవారం సాయంత్రం చీరాల గడియార స్తంభం కూడలిలో కొందరు వాలంటీర్లు, వైసిపి నాయకులు కలసి పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనగా ఆయన ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మరునాడే చీరాల జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాంప్రసాద్, నాయకులు పలువురు మహిళలు ఫ్లెక్సీని దహనం చేసిన ప్రాంతంలో పసుపునీళ్లు చల్లి పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అదే తరుణంలో సమయంలో జై జగన్ అంటూ కొందరు వైసిపి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మ సమీపంలో వద్ద ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరుపార్టీ శ్రేణుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుని తోసుకునేంత వరకూ వచ్చింది. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణలు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులందరూ ఊపిరి పిలుచుకున్నారు.










