ప్రజాశక్తి- బుచ్చయ్యపేట : వైస్ జగన్ మోహన్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో నేరాలు, విధ్వంసాలు తప్ప రాష్ట్రాభివద్ధి ఎక్కడుందని చోడవరం నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి బతుల తాతయ్య బాబు ప్రశ్నించారు. మంగళవారం వడ్డాది తెదేపా కార్యాలయంలో వైసీపీ వెయ్యి రోజుల పాలనపై తెదేపా నేతలు బుక్లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాతయ్యబాబు మాట్లాడుతూ వైకాపా హయాంలో గ్రామాల అభివద్ధిపై చర్చకు తాము సిద్ధమని అన్నారు. ప్రజావేదికను కూల్చడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలు పెట్టడమే దీనికి నిదర్శనం అన్నారు. వైకాపా నిరంకుశ విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ వారు చేస్తున్న ప్రతి తప్పును రాసుకుంటున్నామని దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. అక్రమ కేసులు పెట్టడం తప్ప వైకాపా ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పనపై చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గునూరు మల్లునాయుడు, బుచ్చయ్య పేట సర్పంచ్ సుంకర సూరిబాబు, మాజీ జెడ్పిటిసి వియ్యపు అప్పారావు, మాజీ సర్పంచ్ దొడ్డి కిషోర్, గొన్నా బత్తుల శ్రీనివాసరావు, సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.










