Apr 19,2023 00:04

ట్రైలర్‌ లాంఛింగ్‌ పాల్గొన్న అక్కినేని అఖిల్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

- హీరో అక్కినేని అఖిల్‌
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
అభిమానులు తన మీద పెట్టిన బరువును మోస్తూనే ఎప్పటికప్పుడు వారి ముందుకు వైల్డ్‌గా వస్తూనే ఉంటానని హీరో అక్కినేని అఖిల్‌ అన్నారు. కాకినాడలో ఏజెంట్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకను శ్రేయస్‌ మీడియా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, నిర్మాత సుంకర అనిల్‌, హీరో అక్కినేని అఖిల్‌, హీరోయిన్‌ సాక్షి విద్య పాల్గొన్నారు. నిర్మాత సుంకర అనిల్‌ మాట్లాడుతూ అఖిల్‌తో సినిమా పెద్దగానే చేయాలనుకున్నానని, బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా పని చేసినట్టు చెప్పారు. ఏప్రిల్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన హీరో అఖిల్‌ ప్రకటించారు.