
ప్రజాశక్తి - చీరాల
ఫిజియోథెరఫి, స్పీచ్ థెరఫితో సెరెబాల్ పేలసీతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరమని శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ జనరల్ పిజీషియన్ డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విఠల్‌నగర్ చైతన్య మనోవికాస కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఉచిత వైద్యపరీక్షలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వారి ఆరోగ్యం మెరుగుపడటంలో తల్లిదండ్రులు శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వరల్డ్ సరెబాల్ పెరాలసిస్ డే సందర్భంగా విమనోవికాస కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ప్రిన్సిపల్ ఎన్ మాధురి, డైరెక్టర్ కిషోర్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్, సూర్య పాల్గొన్నారు.