
వైకాపా పాలన రాక్షస పాలన
మాజీ రాజ్యసభ సభ్యులు తులసి రెడ్డి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ
వైకాపా పాలన రాక్షస పాలన అని మాజీ రాజ్యసభ సభ్యుడు నరెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం నిమిత్తం, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయ కర్త బరగోడ్ల హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో తులసి రెడ్డి మాట్లాడారు .కేంద్రం లో బిజెపి, రాష్ట్రము లో వైకాపా ప్రభుత్వాలు ఈ రెండు పార్టీ లు రాహువు, కేతువు లాగా వ్యవహారిస్తున్నాయన్నారు. అలాగే ముఖ్య మంత్రి జగన్ రాయలసీమ వాసిగా ఉంటూ సీమకు తీరని ద్రోహం చేస్తున్నాడన్నాడు. జగన్ మాట తప్పడం ప్రతి రోజు దిన చర్యగా మారిందన్నారు. రాష్టంలో రాక్షస పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అటు కేంద్రం లో రాహుల్ గాంధీని ప్రధాని గా గెలిపించుకుందామని, ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త బరగొడ్ల హుస్సేన్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే AP కి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ అనేక ప్రభుత్వ పధకాలను ప్రజల మేలుకొరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంసుల్ హాక్, కాంగ్రెస్ పార్టీ రుద్రవరం మండల అధ్యక్షులు శ్రేనివాసులు, కాంగ్రెస్ దొర్నిపాడు మండల అధ్యక్షులు చాకలి నాగయ్య, నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంజీవ కుమార్, లక్ష్మయ్య, నాగేంద్ర, బాషా, కిషోర్, రాజు,హుస్సేన్ బాషా, శ్రీరామ్, నాగరాజు, నవీన్, నరసింహరెడ్డి, ఉత్తన్న, సుబ్బారాయుడు, అమిర్, హరుణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్టంలో శాంతిభద్రత లు క్షిణించాయి : తులసి రెడ్డి
నంద్యాల కలెక్టరేట్ : రాష్టంలో శాంతిభద్రత లు పూర్తిగా క్షీణించాయని ప్రజలకు దన మన ప్రాణాలకు రక్షణ లేదని రౌడీలు రాజ్య మేలుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నంద్యాల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డి సి సి అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో వైసిపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందన్నారు.అరాచక ఆంధ్రప్రదేశ్ అయ్యిందని తాలిబన్ల పాలనను మించిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం పైన తులసి రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు.ల్యాండ్,శాండ్, వైన్ ఎర్రచందనం ఎర్రమట్టి సబ్సిడీ బియ్యం మాఫియలు స్వైర విహారం చేస్తున్నాయని విమర్శించారు.
కరెంట్ చార్జీలు , ఆర్టీసీ చార్జీలు , మద్యం , ఇసుక , పెట్రోల్ , డీజిల్, నిత్యావసర సరుకులు ధరలు సామాన్యునికి అందుబాటులో లేవని బాదుడే బాదుడు అన్నట్టు రాష్ట్ర ప్రజలపైనవిపరీతమైన బారాలు వేస్తున్నారని ఆరోపించారు.కేంద్రంలోని బిజెపి దేశాన్ని అప్పుల భారత్ చేసిందన్నారు.1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం 46 లక్షల కోట్లు అప్పు చేయగా 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం 109 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఇండియా ఇస్ ఫర్ సేల్ అన్నట్టుందని,గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ రంగా సంస్థల ఆస్తులైన విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి లాంటి సంస్థలను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందన్నారు.వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఎరువులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు.విలేకర్ల సమావేశంలో టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య అధికారప్రతినిధి ఉకోటు వాసు టౌన్ ఉపాధ్యక్షులు ఆనందరావు సలాం కోడినేతటర్ ఎస్ ఎం డి ఫరూక్ శివారెడ్డి మైనారిటీ నాయకులు రియాజ్ అహమద్ ఉసేన్ లింగారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.