Feb 12,2023 23:54

వైజ్ఞానిక యాత్రకు వెళ్లిన విద్యార్థులు వీరే..

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఢిల్లీలో ఈ నెల 13 నుంచి 24 వరకు జరగనున్న వైజ్ఞానిక యాత్రకు స్థానిక ప్రశాంతి పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థులు బయలుదేరారు. వైజ్ఞానిక యాత్రలో భాగంగా ఢిల్లీ, ఐఐటీ, నీతి అయోగ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, తదితర ప్రదేశాలను సందర్శిస్తారని ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ వైజ్ఞానిక యాత్రకు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. వైజ్ఞానిక యాత్రకు వెళ్లిన విద్యార్దులను ప్రశాంతి విద్యాసంస్థల చైర్మన్‌ ధర్మిరెడ్డి ప్రసాద్‌ అభినందించారు.