Feb 02,2022 11:09

విశాఖ : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకూడదని ... అల్లూరు వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీతమ్మదార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకూడదని కోరుతూ... అధ్యక్షులు సిహెచ్‌.నరసింహారావు, సెక్రెటరీ సంజీవరావు,ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ ఆర్‌ కె మూర్తి లు డిజిటల్‌ సిగేచర్‌ క్యాంపెయిన్‌ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింహారావు, సిపిఎం 78 వ వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు, సిఐటియు నగర కార్యదర్శి ఆర్‌ కెఎస్‌ కుమార్‌, తదితరులు హాజరయ్యారు.