Jul 08,2023 21:29

ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సిఎం జగన్‌

 వేంపల్లె : మండలంలోని ఇడుపులపాయలో దివ ంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సమాధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మొదటిరోజు వైఎస్‌ .రాజ శేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి సిఎం ఇడుప ులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు వెళ్లారు. అనంతరం సమాధిపై పూలమాలలు వేసి తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్‌.భారతితో కలిసి ముఖ్య మంత్రి జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు అనంతరం సమాధి వద్ద నున్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాత్రికి ఇడుపులపాయలోనే సిఎం జగన్‌ బస చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌.అవినాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, పోతుల సునీత, రమేష్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ సుధ, రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లిఖార్జునరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు, డిప్యూటీ మేయర్‌ జఖియాఖానం, ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లిఖార్జునరెడ్డి, పరిశ్రమల సలహా దారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్‌ వి.విజయ b0.2రామరాజు, ఎస్‌పి కేకేఎన్‌ అన్బురాజన్‌, జెసి గణేష్‌ కుమార్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, పాడా ఒఎస్‌డి అనిల్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
పథకాలు అమల్లో వైఎస్‌ఆర్‌కే సాధ్యం
వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షులు షర్మిల
పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నేరవేర్చుందుకు ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో దివంగత నేత వైఎస్‌.రాజశేఖరరెడ్డికే సాధ్యమైందని తెల ంగాణ వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షులు షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు ఉదయం 8 గంటలకు షర్మిల తన తల్లి విజ యమ్మ, కుమారై అంజలి, కుమారుడు రాజా రడ్డిలతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ను గుర్తుకు తెచ్చుకొనే అవకాశం మరో సారి వచ్చిందని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పా ల్సిన అవసరం లేదన్నారు. రుణ మాఫీ, ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాలు పెట్టి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి పోయిన నాయ కుడని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పిం చారన్నారు. అధికారం చేపట్టిన ఐదేళ్లలో 46 లక్షల పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం వైఎస్సార్‌కే సాధ్య మైందన్నారు. గెస్ట్‌ హౌస్‌లో వైఎస్‌ఆర్‌ తెలం గాణ పార్టీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనం తరం ఇడుపులపాయ నుంచి తన వాహనంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని పాలేరుకు వెళ్లారు.